విద్యార్థి సంఘాల ధర్నా

జ్యోతినగర్‌, జూన్‌ 11, (జనంసాక్షి):

గోదావరిఖనిలో అనుమతి ఉన్న ఎస్‌ఆర్‌ఎం జూనియర్‌ కళాశాల ఎన్టీపీసీలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తు… సోమవారం కొన్ని విద్యార్థి సంఘాలు కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశాయి. కళాశాల ముందు భైఠాయించి… ఈ కళాశాలను ఇక్కడే ఏర్పాటు చేయవద్దని నినాదాలు చేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ నాయకులు ఎస్‌బి.సాజ్‌, శంకర్‌, అనూష్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు రాజు, ముఖేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఎం.సూర్య, సుధీర్‌ పాల్గోన్నారు.