విద్యార్థులకు అవగహన కల్పిస్తున్న ఏంఈవో రవి

 

 

 

 

 

పెన్ పహాడ్ మార్చి 06 (జనం సాక్షి) : విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఏంఈవో రవి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలంలోని ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పబ్లిక్ పరీక్షలకు సంసిద్ధులుగా చేయడం కోసం జెడ్ పి ఏచ్ ప్రధానోపాధ్యాయులు వెంకన్న అధ్యక్షతన ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మండల విద్యాధికారి ఎన్ రవి ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులు పరీక్షలు రాయబోయే విధానాన్ని గూర్చి వారికున్న సందేహాలను నివృత్తి చేయడం కోసం వారిలోని భయాన్ని, ఆందోళన ,తొలగించడం కోసం మండలంలో ఏడుగురు ఉపాధ్యాయుల చేత ,తెలుగు, హిందీ ,ఆంగ్లము ,గణితము ,భౌతిక రసాయన శాస్త్రము, జీవశాస్త్రము ,సాంఘిక శాస్త్రము సబ్జెక్టుల మీద విద్యార్థులందరికీ ప్రశ్నాపత్రాల సరళిని గురించి, సులభతరమైన ప్రశ్నలు కఠినతరమైన ప్రశ్నలకు ఎలా జవాబు రాయాలో ఎక్స్పర్ట్ టీచర్ల ద్వారా విద్యార్థులకు వివరించడం జరిగింది జిల్లా కలెక్టర్ సందేశాన్ని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు చేరే విధంగా వారు చెప్పిన సూచనలు పాటిస్తూ విద్యార్థులందరూ నూరు శాతం ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని కోరారు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ ఉదయం సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగతులు మరియు స్లిప్ టెస్టులు ,వారాంతపు పరీక్షలు విద్యార్థులకు ఎప్పటికప్పుడు నిర్వహించి ఫలితాలను విద్యార్థులకు తెలియజేస్తూ వారు చేసిన పొరపాట్లను గుర్తించి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేసి విద్యార్థులందరూ పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలని సందేశంలో తెలియజేశారు
ఈ కార్యక్రమంలో వివిధ విషయ ఉపాధ్యాయులు కృష్ణయ్య ,జాన్ షరీఫ్ ,ప్రభాకర్ ,
గుండా వెంకటేశ్వర్లు ,జమాల్ షరీఫ్ ,ఉపేందర్ ,కృష్ణప్రియ కేజీబీవీ