విద్యార్థులకు హిందూ ధర్మ ప్రచార కథ

భువనగిరి టౌన్ జనం సాక్షి:– తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో కథ చెప్తారా ఊకొడతాం అనే కార్యక్రమము భువనగిరి శ్రీవాణి విద్యాలయంలో నిర్వహించబడింది ఈ యొక్క కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొని మన పురాణ గాధలు, మన ధర్మము కు సంబంధించిన వివిధ అంశాలపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు పిల్లలతో మన సంస్కృతి పట్ల వారికి అవగాహన కలగడమే కాకుండా వారు ధర్మబద్ధంగా ఎలా జీవించాలో కూడా నేర్చుకునే వీలు కలుగుతుందని తెలియజేశారు. గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మొదటి రెండవ మూడో బహుమతులను జూనియర్ సీనియర్ విభాగాలుగా అందించారు, విభాగంలో మొదటి బహుమతిగా వి. మనస్విని ఐదవ తరగతి జీనియస్ స్కూల్, ద్వితీయ బహుమతి శ్రీ వర్షిత మూడవ తరగతి విజ్ఞాన్ స్కూల్, తృతీయ బహుమతి అన్విత రెడ్డి ఐదవ తరగతి జీనియస్ స్కూల్ విద్యార్థులు బహుమతులు పొందడం జరిగింది. సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిగా కే మాధుర్య 9వ తరగతి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, ద్వితీయ బహుమతి ఎం .స్వరహాసిని పదవ తరగతి జీనియస్ స్కూల్, తృతీయ బహుమతి ఎస్ .రాణి గంజ్ హై స్కూల్ విద్యార్థులు బహుమతులను కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టి. ఉమేష్ శర్మ, ఎం .భీష్మాచార్య, మాధవరెడ్డి, బోనగిరి సత్యనారాయణ, కదురు రమేష్ బాబు న్యాయ నిర్ణయితలుగా వివరించారు, ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు కోళ్ల ప్రవీణ్ గుప్తా గారు జిల్లా ఇన్చార్జ్ బాలేశ్వర్ గారు తదితరులు పాల్గొన్నారు