విద్యార్థులు సమస్యలపై ఎబివిపి బంద్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : కళాశాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఇచ్చిన బంద్‌తో  బుధవారం జిల్లాలోని కళాశాలలు మూతపడ్డాయి. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో  ఫీజుల దోపిడీని అరికట్టి ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆ సంఘం కార్యదర్శి పరమేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. అనేక సార్లు వివిధ సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయక, వసతులు కల్పించక విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేని  కళాశాలలను మూసి వేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేెపడతామని ఆయన హెచ్చరించారు. బంద్‌ సందర్భంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు.