విద్యార్థుల ర్యాలీ
హైదరాబాద్: ఆర్ట్స్ కళాశాల నుంచి గన్‌పార్కు వరకు ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న సమరదీక్షకు బయలుదేరిన విద్యార్థులు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వరకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. ఓయూ ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేశారు.