విద్యార్థుల వసతి గృహంలో కలెక్టర్‌ బస

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోని వసతి గృహాల్లో సమస్యలను తెలుసు కునేందుకు వసతి గృహాల్లో బస చేసే కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ తెలియజేశారు. నిజామాబాద్‌ మండలం ముదక్‌పల్లి ఎస్టీ బాలుర వసతి గృహంలో రాత్రి కలెక్టర్‌ విద్యార్థులతో కలిసి బస చేశారు. ముందుగా వసతి గృహంలోని గదులను పరిశీలించి విద్యార్థులతో  మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భోజనం, చదవు విషయంలో శ్రద్ద తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లొ బస చేయడం వల్ల విద్యార్థుల నుంచి పూర్తి స్థాయిలో  సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుదని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్టీ,ఎస్సీ, మైనార్టీ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి ఒకరోజు బస చేసే కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్‌ తెలియజేశారు.