విద్యార్థుల సమస్యలపై స్పందిచకపోతే ఆమరణ నిరాహర దీక్ష:కిషన్‌రెడ్డి

తిరుపతి: రాష్ట్రంలో యుద్దప్రాతిపదికన ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వం విద్యార్థుల పట్ల స్పందించని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించారు. మంత్రులపై ఆరోపణలు వస్తున్న గవర్నర్‌ స్పందించకపోవటం బాధకరమని, చేతకాని ప్రభుత్వంవల్ల అభివృద్ది కుంటుపడుతుందని విమర్శించారు.