విద్యుత్‌శాఖకు మంత్రి లేకపోవడం దారుణం : సోమిరెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విద్యుత్‌శాఖను మంత్రి లేకపోవడం దారుణమని తెదేపానేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్ శాఖకు మంత్రి లేకుండా చేయటం కిరణ్‌కుమార్‌రెడ్డికే చెల్లిందన్నారు. మంత్రివర్గ సమావేశానికి 8 మంత్రులు హాజరుకాకుండా ఉండటం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.



