విద్యుత్‌ కోతలపై తిరుపతిలో తెదేపా మహాధర్నా

తిరుపతి: విద్యుత్‌ కోతలకు నిరసిస్తూ తిరుపతిలోని విద్యుత్‌శాఖ కార్యాలయం ఎదుట తెదేపా మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో 5 జిల్లాల తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అప్రకటిత కోతలు ఎత్తివేసి, వ్యవసాయానికి 7 గంటల కరెంటు అందించాలని నేతలు డిమాండ్‌ వ్యక్తం చేశారు.