విద్యుత్ విధానంపై స్పష్టమైన ప్రకటన చేయాలి:తెదేపా నేత రేవూరి
విద్యుత్ సమస్యలపై విధిలేని పరిస్థితుల్లో చివరి ప్రయత్నంగా తాము నిరాహార దీక్షలను చేపట్టామని తెదేపా నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.తాము చేపట్టిన దీక్షలను ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్దంగా భగ్నం చేసి ఆస్పత్రికి తరలించిందని ఆయన మండిపడ్డారు.ఇకనైనా ప్రభుత్వం విద్యుత్ విధానంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.విద్యుత్ బారాన్ని ప్రభుత్వమే భరించాలని విద్యుత్ కోతలను నివారించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కొరారు.


