విద్యుత్ సమస్యలపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. గ్రామాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆయన హెచ్‌ఆర్సీకి విన్నవిరచారు. మార్చి 20 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్‌కో సీఎండీకి హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1 నుంచి గ్రామాల్లో 12 గంటలు కరెంట్ కట్ చేస్తున్న విషయం తెలిసిందే.