విద్యుత్‌ సరఫరా చేయని ప్రభుత్వం తిగిపోవడం శ్రేయస్కరం

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణ
నెల్లూరు, జూలై 22 : విద్యుత్‌ సరిగా సరఫరా చేయని ప్రభుత్వం అధికార ఫీఠం నుండి తప్పుకోవడం మంచిదని టీడీపీ జల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రభుత్వానికి విద్యుత్‌ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ప్రజలపై సర్‌చార్జీల భారం మోపడం మినహా, విద్యుత్‌ సక్రమంగా సరఫరా చేయాలన్న కనీస జ్ఞానం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదని విమర్శించారు. బహిరంగ సభల్లోనే సర్‌చార్జీలు భరించాల్సిందేనని ముఖ్యమంత్రి తేల్చిచెప్పడం ఆయన బాధ్యత రాహత్యానికి నిదర్శనమని అన్నారు. ఈ నెలాఖరులో ఖరీప్‌ సీజన్‌ ప్రారంభం కానున్నండగా పరిస్థితి ఈదేవిధంగా కొనసాగితే కోట్ల రూపాయల మేర రైతులు నష్టపడాల్సి వస్తుందని సోమిరెడ్డి అన్నారు. జిల్లాలో ఉధృతంగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కాని, ప్రజాప్రతినిధులు కాని రైతులకు హామీ ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో ఒకవైపు భూగర్భజలాలు పడిపోతుండగా వర్షాలు కురిస్తే ఆ నీటి ఆధారంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామనడం సిగ్గుచేటు అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కె. శ్రీనివాసులరెడ్డి, ఎ. ఆనందరెడ్డి, ఎన్‌. మల్లికార్జున యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.