విద్యుత్‌ సౌధ ముట్టడికి టీఆర్‌ఎస్‌ పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంలో రైతులకు 7 గంటల కరెంటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ విద్యుత్‌ సౌధ ముట్టడికి టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాల, మండల కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలని, సబ్‌స్టుషన్‌లను ముట్టడించాలని టీఆర్‌ఎస్‌ ఎల్‌సీ నేత ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు.