విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి

తలపై గాయంపట్ల పలుఅనుమానాలు?

కురవి, జూన్‌ 16 (జనంసాక్షి): విద్యుత్‌ ఘాతానికి గిరిజనుడు మృతిచెందిన సంఘటన శనివారం ఉప్పరిగూడెంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారంగా మండలంలోని ఉప్పరిగూడెం గ్రామ చివారు గోపతండాకు చెందిన గుగులోత్‌. కిషన్‌ (43)గోర్రెకొనడం కోసం ధర అడగడానికి అదే గ్రామానికి చెందిన భూక్య .ల క్ష్మణ్‌ ఇంటికి వెళ్లాడు.మృతుడు కిషన్‌  ిప్రక్కనే ఉన్న కొబ్బరి చెట్టుకు ఆనుకొ ని నిలబడిఉన్నాడు. లక్ష్మణ్‌ ఇంటినుండి ప్రక్కనే ఉన్న రేకులసెడ్డికి బట్టలు ఆరవేయడం కోసం జేవైరు కట్టారు. ఇంట్లోకొచ్చిన కరంట్‌ తీగ జేవైరుకు తగిలింది.కొబ్బరి చెట్టుకు నిలబడిఉన్న మృతుడు కిషన్‌(43) ప్రక్కనేఉన్న జేవైరుని పట్టుకున్నాడు. కరంట్‌రావడంతో మృతిచెందాడు.మృతుడు కింద పడుచుండగా కిషన్‌తలకు గాయం తగిలిందని . మృతుని బార్య ఇచ్చిన వాగ్మూలం మెరకు కేసున మోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి బార్య ఉల్లి, కూతురు శీరీష 12, కుమారులు శ్రీకాంత్‌10, శ్రీరాంలు ఉన్నారు.  లక్ష్మణ్‌కుమృతుడు కిషన్‌కు మద్య గత 3నెలల క్రీతం గొడవపడి ినారు.గ్రామ పెద్దల పంచాయితిలో కిషన్‌కు 300రూ జరిమాన విదించినట్లుగా తెలిసింది.ఈకక్షతో తలపై కొట్టిచంపారనే అనుమానాలు వస్తున్నాయి.