విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి

గ్రామన్థుల ధర్నా

మంగపేట: మండలంలోని బూర్‌నర్సాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి చెందాయి. బాధితుల కథనం మేరకు… గ్రామానికి చెందిన బండపల్లి ఏకయ్య, ముత్యాలుకు చెందిన పాడి గేదెలు మంగళవారం ఉదయం మేత కోసం బయటికి వెళ్తున్న సమయంలో వేర్వేరు చోట్ల ప్రమాదవశాత్తూ విద్యుత్‌ తీగలు తగిలి రెండు పాడిగేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ట్రాన్స్‌కో అధిరకారులు నష్టపరిహరం అందించాలంటూ గ్రామస్థులు గ్రామంలోని ప్రధాన రహదారిపై సుమారు గంటసేపు ధర్నా నిర్వాహించారు. బాధితులకు న్యాయం చేకూరుస్తామని అధికారులు హమీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.