విధులు బహిష్కరించిన న్యాయవాదులు
హైదరాబాద్: నాంపల్లి కోర్టులో న్యాయవాదులు ఈరోజు విధులు బహిష్కరించారు. హైకోర్టు ఎదుట ఆందోళనల సమయంలో నమోదైన కేసులు ఎత్తివేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. తమపై విచారణకు ఆదేశిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.