వినాయకుడు ఆటంకాలు తోలగించే విగ్నేశ్వరుడు.

విగ్నేశ్వరుని అశీస్సులు ప్రజలపై నిరంతరం ఉండాలి.
జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 3(జనంసాక్షి) వికారాబాద్
జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో
భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాపించిన వినాయకులను
జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి దర్శించి
ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా
జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి మాట్లాడుతూ విఘ్నాలు తోలగించి విజయాలు ప్రసాదిం చాలని వినాయకున్నిప్రార్థించారు .ప్రజలపై వినాయకుని అశీస్సులు నిరంతరం ఉండాలని కోరారు.ప్రతిఒక్కరు భక్తి శ్రద్ధలతో గణనాథుడిని పూజించాలన్నారు.విశేష పూజలు అందుకున్న వినాయకుడు ఆటంకాలు తోలగించే విగ్నేశ్వరు డని తెలిపారు .కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా వినాయకుడిని భావించి పూజలు చేస్తుంటారు.నూతన కార్యక్రమాలు ప్రారంభించేట పుడు ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారని తెలిపారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసం లో కూడా గణపతిని పూజిస్తారు.అందుకే గణనాథుడిని అదిదేవుడుగా హిందూ సాంప్రదాయం ప్రకారం కొలుస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, ఎంపీపీ కరుణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కౌన్సిలర్ నీరజారెడ్డి, టీఆర్ఎస్ నాయకురాలు నర్మదారెడ్డి, కుప్పన్ కోట్ చందర్, నరేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.