వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వాలి:డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత

జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 30:
అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ భక్తులు వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠించి జరుపుకునే వినాయక చవితి మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా అందించాలని, అదేవిధంగా ఎటువంటి చార్జీలు వసూలు చేయకూడదని డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
అనుమతులు కఠినతరం చేసి చార్జీలు వసూలు చేయడం తగదన్నారు. హిందూ భక్తులు గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పండుగ పూర్తిస్థాయిలో జరుపుకోలేదని అన్నారు. ఈ ఏడాది జరుపుకోవాలనుకున్న వినాయక చవితికి అనుమతులను సరళతరం చేసి చార్జీలు లేకుండా చేయాలని దాసరి ప్రవీణ్ కుమార్ నేత డిమాండ్ చేశారు. అదేవిధంగా వీధుల్లోని చవితి మండపాలకు ఎలాంటి షరతులు లేకుండా నాణ్యమైన విద్యుత్ ఉచితంగా ఇవ్వాలన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన పెద్ద నష్టం ఏమీ లేదన్నారు. దేవుడి కోసం ఆమాత్రం చేయలేరా అని ఆయన ప్రశ్నించారు. ఉచిత పథకాల పేరిట బోలెడంత సొమ్ము ధారాదత్తం చేస్తున్నారని గుర్తు చేశారు. కాబట్టి ఈసారి ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రభుత్వం తమ ఉదారత చాటుకోవాలని కోరారు.
ప్రజలు పర్యావనహితంగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని దాసరి ప్రవీణ్ కుమార్ నేత కోరారు. ప్రభుత్వం మట్టి విగ్రహాల తయారీదారులకు ప్రోత్సహించి ఉచితంగా మట్టి సరఫరా చేయాలన్నారు