వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలి

* వినాయక విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి

టేకులపల్లి,సెప్టెంబర్ 17(జనంసాక్షి): టేకులపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల
వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని, వినాయక విగ్రహ ప్రతిష్ట మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్సై రమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పోలీస్ శాఖ రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ , మండపమునకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందించినదని అన్నారు. గణేష్ ఏర్పాటుకు అనుమతి కోసం టిఎస్ పోలీస్ పోర్టల్ సైట్ నందు వివరాలను పొందుపరచాలని సూచించారు. గణేష్ విగ్రహం ప్రతిష్టించిన రోజు నుండి నిమజ్జనం వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్ వదంతులను నమ్మకూడదని ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసులకు లేదా డయల్ 100సమాచారం అందించాలని అన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, నిమజ్జనం ఉత్సవాలను అందరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.