వినికిడి లోపంపై అవగాహన ర్యాలీ

హైదరాబాద్‌: ప్రపంచ బదిరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినికిడి లోపంపై కోఠి ప్రభుత్వం ఈఎన్‌టీ ఆసుపత్రి అవగాహన ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు. కోఠి నుంచి అసెంబ్లీ వరకూ ర్యాలీ చేపట్టారు. వినికిడి లోపాలు పొగొట్టేందుకు ఎన్నో ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు బాల్యంలోనే గుర్తించి తమ పిల్లలను వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రామకృష్ణ చెప్పారు.