విప్రో త్రైమాసిక ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: 2012-13 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను విప్రో విడుదల చేసింది. 2012-13ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18.37శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ ప్రకటించింది. రూ.1,580 నికరలాభం సాధించినట్లు వివరించింది. దీంతో విప్రో సంస్థ నికర ఆదాయం 19.57శాతం వృద్ధి చెందింది. విప్రో మొత్తం ఆదాయం రూ.10, 888 కోట్లుగా నమోదైంది.