విరిగిన రైలు పట్టా.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

వరంగల్‌ : తాళ్లపూనపల్లి-మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య డౌన్‌లైన్‌ 434 కిలో మీటర్‌వద్ద రైలు పట్టా విరిగింది. దీంతో కేసముద్రంలో పుష్‌పుల్‌ రైలును అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనలో విజయవాడ వైపు వెళ్ళే రైళ్లు ఆలస్యంగా సడుస్తున్నాయి. ఘటనస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తు పనులు చేపట్టారు.