వివాహిత దారుణ హత్య

భద్రచలం: పట్టణంలోని కొత్తకాలనీకి చెందిన నిర్మల(20) అనే వివాహిత బుధవారం తెల్లవారు జామున
దారుణ హత్యకు గురైంది. ఈమె మెడకు వైర్లు బిగించి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. భర్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనస్థలికి పోలీసులు వెళ్లి విచారణ చేపట్టారు.