విశ్వకర్మల ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి

 

రుద్రంగి ఆగస్టు 25 (జనం సాక్షి);
రుద్రంగి మండల కేంద్రంలో గురువారం 69 జీవో ను రద్దు చేయాలని కోరుతూ రుద్రంగి విశ్వకర్మ నాయకులు తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం తీసుకవచ్చిన జీవో 69 ద్వారా విశ్వకర్మల చేతి వృత్తులు నిర్వీర్యం అవుతున్నాయని వెంటనే ఇట్టి జీవోను రద్దు చేసి 2016 లో ఉన్న 55 జీవో ను అమలు పరచాలని కోరుతు రుద్రంగి తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసమని అన్నారు.యాదవులకు గోర్లు, మత్స్యకారులకు చేపలు,నేతన్నలకు ఉపాధి, గౌడ్స్ కి పింఛన్లు,దళితులకు దళిత బంధు,నాయి బ్రహ్మణులకు రజకులకు కరెంట్ బిల్లు సబ్సిడీ కల్పిస్తూన్న అన్ని కులాలకు మేలు చేసిన ఈ రాష్ట్ర
ప్రభుత్వం మాకు  మాత్రం మర్చిపోయిందని అన్నారు.ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఉపాధి అవకాశాలు పెంచన్లు ఇవ్వలేకపోయిందని అన్నారు.పింఛన్లు ఉద్యోగాలు  సబ్సిడీలు విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే ఈ 69 జీవోను రద్దు చేసి విశ్వకర్మలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు

తాజావార్తలు