వుడా భూకుంభకోణం కేసుపై సీబీఐ జేడీ సమీక్ష

విశాఖపట్నం : వుడా కుంభకోణం కేసుపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ విశాఖలో సమీక్షించారు. దాదాపు 500కోట్ల భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీనిపై సీబీఐ కేసు నమోదుచేసి ప్రాథమిక విచారణ చేపట్టింది. కేసు పురోగతిని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ విశాఖలోని ప్రాంతీయ కార్యలయంలో సమీక్షించారు. ఆ తర్వాత ఆయన వుడా కార్యాలయానికి వెళ్లారు. వుడా ప్రధాన భవనంలోని అంతస్థును సీబీఐ ప్రతేక న్యాయస్థానం కోసం కేటాయించే విషయంపై వుడా వీసీ శశిధర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగానే వుడా భూకుంభకోణం కేసు గురించి కూడా సమాచారాన్ని అడిగినట్లు సమాచారం.