వృద్ధుల ఆరోగ్య భద్రత పథకంలోనూ తెలంగాణకు అన్యాయం

ఎంపీ రాజయ్య
హైద్రాబాద్‌, సెప్టెంబర్‌20(జనంసాక్షి):
వృధ్ధుల ఆరోగ్య భద్రత పథకంలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఎంపీ సి రాజయ్య ఆరోపించారు. ప్రతి సారీ ఈ పథకం అమలులో ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపెడుతోందని మండిపడ్డారు. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది సైతం పథకం అమలులో ప్రభుత్వం అటవకాశం కల్పించలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ముప్ఫై మందికి పైగా ఎంపీలున్నా తమ సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ పధకాలు, నిధులు పొందడంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నో ప్రాజెక్ట్‌లు ముఖ్యమంత్రి నిర్లిప్తతో వెనక్కి మళ్లాయన్నారు. మొక్క జొన్న సాగులో దేశంలో కరీంనగర్‌ జిల్లా అగ్రస్ధానంలో ఉందని అయితే జొన్న పరిశోధన కేంద్రం పంజాబ్‌కు తరలిపోయందన్నారు. సీఎం చొరవ చూపించి ఉంటే ఈ పరిశోధన కేంద్రం కరీంనగర్‌ జిల్లాకు వచ్చి ఉండేదన్నారు. తెలంగాణ కాబట్టే సీఎం చొరవ చూపలేదని విమర్శించారు.