వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి ఇల్లు లూటీ
వరంగల్: జిల్లాలోని శివనగర్‌లో ఘరానా దొంగతనం జరిగింది. వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి ఇల్లు లూటీ చేశారు. నగలు, నగదు, విలువైన వస్తువులు అపహరించారు. ఇంట్లో అద్దెకు ఉండే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఉదయం సోయిలేకుండా పడి ఉన్న దంపతులను గుర్తించిన స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.