వెటర్నరీ అసిస్టెంట్ రమేష్‌కు ఘన సన్మానం
తర్లుపాడు ,జూలై 24,: మండల కేంద్రమైన తర్లుపాడు పశువైద్యశాలలో పనిచేసి పదోన్నతిపై మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి ఇటీవల బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నెహ్రూయూత్ ఆధ్వర్యంలో సిహెచ్ రమేష్‌కు గ్రామస్తులు , సిబ్బంది శాలువాలు, పూలమాలలు సోమవారం పశువైద్యశాల ఆవరణంలో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి నెహ్రూయూత్ అధ్యక్షులు బి పుల్లయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి కవిత మాట్లాడుతూ వైద్యాధిóకారిగా బాధ్యతలు తాను చేపట్టినప్పటి నుండి రమేష్ తన విధులను బాధ్యతయుతంగా నిర్వహించేవారని అన్నారు. వెటర్నరీ రాష్ట్ర యూనియన్ నాయకులు చెంచయ్య మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి అంకితభావంతో చిత్తశుద్ధితో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ప్రజల మన్ననలు చూరగొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ ప్రధానోపాధ్యాయులు బండి వెంకటేశ్వరరెడ్డి, వేణుగోపాలస్వామి నిత్యశ్రేయోబిలాషి జవ్వాజి భాస్కరావు కోలగట్ల భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.