వేడుకల కోసం కేక్ తీసుకువస్తూ ఇద్దరి మృతి
మైదుకూర్ : నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల కోసం కేక్‌ను తీసుకవస్తుండగా ద్విచక్రావాహనం అదుపుతప్పడంతో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లా చాపాడు మండలం పల్నాడుపల్లె క్రాస్ వద్ద చోటుచేసుకుంది. మృతులను మైదుకూరుకు చెందిన మస్తాన్, కొప్పరపు మహేశ్‌లుగా గుర్తించారు. కొత్త సంవత్సరం రోజున ఈ ఘటన చోటుచేసుకోవడంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.