*వైఎస్సార్ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి*

– మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

మునగాల, సెప్టెంబర్ 02(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని తాడ్వాయి, విజయరామపురం, కలకోవ గ్రామాలలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయన్నారు. రాష్ట్రమే తన కుటుంబంగా భావించి, రాష్ట్ర సంక్షేమం కోసం పరితపించి బతికిన మనిషి వైఎస్ఆర్ అన్నారు. ఆయన ఐదేళ్ల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించిన ఘనత దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జయపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలిశెట్టి బుచ్చిపాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య, జిల్లా అధ్యక్షులు బచ్చు అశోక్, మునగాల ఎంపిటిసి సభ్యులు ఉప్పల రజిత, కాసర్ల కల్పన, ఐఎన్టియూసీ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కాసర్ల కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జానకి రెడ్డి, శంకర్, ఎస్కే రషీద్, కాసర్ల వెంకట్, కొట్టావుల సైదులు తదితరులు పాల్గొన్నారు.