వైఎస్‌ ప్రభుత్వం చేనేతకు ఏమి చేసింది.

హైదరాబాద్‌: వైఎస్‌ హయంలో ఆయన ప్రభుత్వం చేనేత రంగానికి ఏమి చేసిందో వైఎస్సార్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయ చెప్పాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు వినోద్‌ ప్రశ్నించారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను సైతం వైఎస్‌ ఆదుకోలేదని ఆరోపించారు. చేనేత కార్మికులకు సీఎంగా వైఎస్‌ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు.