వైకాపాలో ఉండి తెరాసను విమర్శించే నైతికహక్క కొండా సురేఖకు లేదు: ఈటెల
హైదరాబాద్: సపాదనే లక్ష్యంగా పుట్టిన వైకాపాలో ఉండి తెరాసను విమర్శించే నైతికహక్కు కొండా సరేఖకు లేదని తెరాస శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ముందుకు రాకపోతే వైకాపా బండారం బయటపడుతుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తేనే సభ సజావుగా సాగుతుందని తెరాస ఎమ్యెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలను 15రోజులపాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు.



