వైకాపాలో ప్రొఫెసర్‌ విభాగం ఏర్పాటు

హైదరాబాద్‌:వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ప్రోఫెసర్‌ విభాగాన్ని  ప్రారంబించారు.పార్టీ నేత సోమయాజులు అధ్యక్షతన పార్టీ తీర్ధం పుచ్చుకున్న పలువురు అధ్యాపకులు ఈ వింగ్‌లో సభ్యలుగా చేరారు.ఇక నుంచి పార్టీ కార్యక్రమాలు,సమావేశంలో మేధోమదనం చేయడానికి ఈ విబాగం చేదోడువాదోడుగా ఉపయోగపడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.ఈ విబాగం ద్వారా సమాజంలో వస్తున్న ఆర్ధిక సామాజిక మార్పులనై ఎప్పటికప్పుడు నివేదికల్ని పార్టీ ముఖ్యనేతలకు అందించనున్నట్లు ప్రొఫెసర్‌ విబాగం ప్రతినిదులు పార్టీ కార్యాలయంలో తెలిపారు.