వైద్యం వికటించి మహిళ మృతి ఆర్‌ఎంపీిని నిలదీసిన బంధువులు

చందుర్తి, మే24 (జనంసాక్షి):
చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో వైద్యం వికటించి చింతపల్లి సునీత(27) అనే మహిళ గురువారం మృతి చెందింది. సనీత రెండో సంతానంలో కుమారుడు జన్మించాడు. డెలివరీ అయిన తర్వాత రక్తస్రావంతో స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్‌ పడాల శ్రీధర్‌ను సునీత ఆశ్రయించింది. రక్తస్రావనాన్ని తగ్గించేందుకు సునీతకు శ్రీధర్‌ ఇంజెకెన్స్‌ ఇవ్వగా వికటించింది. సునీత తీవ్రత పెరగగా మృతి చెందింది. డాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే సునీత మృతి చెందిందని బంధువులు ఆంధోళన చెందారు. ఆర్‌ఎంపి డాక్టర్‌ను బంధువులు, వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు నిలదీశారు. మృతురాలికి భర్త శ్రీనివాస్‌, కుమార్తె , కుమారుడు ఉన్నారు. చర్చల అనంతరం సునీతకు అంత్యక్రియలు నిర్వహించారు.