వైద్యవిద్యా సంచాలక కార్యాలయ ముట్టడి యత్నం భగ్నం
హైదరాబాద్: నగరంలోని కోఠి ప్రాంంతంలో ఉన్న వెద్యవిద్యా సంచాలక కార్యాలయం ముట్టడికి విద్యార్థి వైద్యులు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య సేవల నిబంధనలో మార్పు చేయాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ విద్యార్థి వైద్యులు ఆందోళన చేపట్టిన సంగతి విదితమే.