వైద్య విజ్ఞాన ఆధ్వర్యంలో నర్సింగ్‌ విద్యార్థుల శోభాయాత్ర

శ్రీకాకుళం, ఆగస్టు 3 : ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని రాజీవ్‌ వైద్య విజ్ఞాన ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రిమ్స్‌ వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, నర్సింగ్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. రిమ్స్‌ నుంచి డే అండ్‌ నైట్‌ కూడలి వరకు తల్లిపాల విశిష్టతను చాటుతూ భారీ శోభాయాత్ర నిర్వహించారు. రిమ్స్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. రిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ డి.వి.ఎస్‌.ఎస్‌. రామమూర్తి శోభాయాత్రను రిమ్స్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. తల్లిపాల ప్రాధాన్యతను తెలియజేసే నినాదాలతో విద్యార్థులు రహదారులన్ని మారు మ్రోగించారు.