వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ నవీన్
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 24 :- ప్రజలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ అన్నారు 25 డివిజన్ ప్రాంతానికి చెందిన ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం శ్రీ బాలాజీ మల్టీస్పెషటి హాస్పిటల్ వైద్యుల నేతృత్వంలో కార్పొరేటర్ నవీన్ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు సుమారు 200 మందికి బీపీ షుగర్ తో పాటు ఇతర ఆరోగ్యపరమైన సమస్యల తో వచ్చిన వారికి నాణ్యమైన పరీక్షలు చేసి మందులు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు హాస్పిటల్ వైద్యులు కార్పొరేటర్ నవీన్ ను శాలువాతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీకర్, శ్రీలక్మి, చందు మరియు డాక్టర్స్, సిబ్బంది మరియు డివిజన్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు