వైసీపీలో చేరిన ఎంపీ రవీంద్రబాబు
– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్ మోహన్‌రెడ్డి
– రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైసీపీలో చేరా
– ప్రత్యేక ¬దాను నీరుగార్చింది తెదేపానే
– తెదేపా హయాంలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట
– వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సమన్యాయం
– విలేకరుల సమావేశంలో రవీంద్రబాబు
హైదరాబాద్, ఫిబ్రవరి18(జనంసాక్షి) : ఎన్నికల దగ్గరపడుతున్న వేళ ఏపీలో టీడీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు.. సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. ఇటీవల వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ వెంట వైసీపీ కార్యాలయంకు వచ్చారు. వైసీపీ అధినేత ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకముందు టీడీపీకి, ఎంపీ పదవికి రవీంద్రబాబు రాజీనామా చేశారు. టీడీపీ అధిష్టానం అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో రవీంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అందుకే వైసీపీలో చేరాలని నిర్ణయానికి వచ్చారు. రెండువారాలుగా వైసీపీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక రిజర్వ్‌డు సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకుంటున్నారట. వైసీపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. రవీంద్రబాబు వైసీపీలో చేరబోతున్నట్లు గతవారమే ప్రచారం జరిగినా.. ఆయన టీడీపీని వీడే ప్రసక్తేలేదని చెప్పారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. అధినేత ఎలా చెబితే అలా నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉన్నట్టుండి వైసీపీలో చేరారు. రవీంద్రబాబు కూడా టీడీపీని వీడటంతో.. వైసీపీలో చేరిన అధికార పార్టీ ఎంపీల సంఖ్య రెండుకు చేరింది. రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డితో పాటూ ఇటీవల చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైసీపీలో చేరా – రవీంద్ర
తెదేపా కులతత్వ పార్టీ అని రవీంద్ర విమర్శించారు. కేవలం ఒకే సామాజిక వర్గానికి ఆ పార్టీలో న్యాయం జరుగుతుందని, దళితుడినైన తనను పైకి రాకుండా అణగదొక్కారన్నారు. కేవలం ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా మిగిలిన సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ¬దా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని, ఆయన వల్లే ప్రత్యేక ¬దా రాలేదని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోవడం వల్లే చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశారని ఆరోపించారు. ఆంధప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనికిరారని, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోట అవినీతి పెరిగిపోయిందని, ఒకే సామాజిక వర్గానికి మేలు జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్ సీపీలో చేరినట్టు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా సాధించే సత్తా వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై వైఎస్సార్ సీపీని గెలిపించాలని రవీంద్రబాబు కోరారు. పేదరికం పోవాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు. కులాలవారీగా చంద్రబాబు దగ్గర ఆర్మీ ఉంటుందని, ఏ కులం వారితో ఆ కులం వారిని తిట్టిస్తారని చెప్పారు. అమలాపురం ఎంపీ పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను విూడియాకు చూపించారు. టీడీపీకి కూడా రాజీనామా చేసినట్టు తెలిపారు.