వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘం కార్యాలయంలో చోరీ

పెగడపల్లి : మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘం కార్యాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. తాళాలు పగల గొట్టి లోనికి ప్రవేశించి బీర్వాలో ఉన్న రూ.1.75 లక్షల నగదును అపహరించుకుపోయారు. సిబ్బంది సోమవారం ఉదయం చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.