వ్యవసాయ స్థితిగతులపై మంత్రి కన్నా సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ స్థితిగతులపై జిల్లా జేడీలతో మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సమీక్ష జరిపారు. నిజామాబాద్‌, నల్గొండ, విశాఖ మినహా రాష్ట్రంలో వర్షపాతం బాగానే ఉందని ఆయన తెలియజేశారు. ఇప్పటివరకు 98 శాతం భూమిని రైతులు సాగుచేశారన్నారు. వేసిన పంటలన్నీ బాగానే ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కృష్ణా డెల్టాకు 10 టీఎంసీల నీటిని కేటాయింయేందుకు కర్ణాటక సీఎంను కోరామన్నారు.