వ్యాట్‌ ఎత్తివేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు : కేసీఆర్‌

హైదరాబాద్‌ : వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ ఎత్తివేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని కేసీఆర్‌ హెచ్చరించారు. ఆయన ఇందిరాపార్కు వద్ద వ్యాట్‌కు నిరసనగా వస్త్రవ్యాపారులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ కోతలు పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయని, ప్రభుత్వ అసమర్ధతవల్లే లోపాలని కేసీఆర్‌ అన్నారు. దేశంలో ఎ్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వ్యాట్‌ విధించడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యాట్‌ విధించడంపై శాసనసభలో ప్రభత్వాన్ని నిలదీస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాట్‌ రద్దు చేసేందుకు మంత్రులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేసీఆర్‌ అన్నారు.

తాజావార్తలు