శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం.. ప్రత్యేక పూజలు.

తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు ఆగస్టు 27 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎన్కేతల గ్రామంలో వెలసిన శనీశ్వర ఆలయంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అలయంలో కొలువుదీరిన శనీశ్వర స్వామిని దర్శించుకుని తైలాభిషేకం… ప్రత్యేక పూజలు నిర్వహించారు.శనివారం శ్రావణమాసం ముగింపు మరియు పొలాల అమావాస్య పురస్కరించుకొని ఆలయంలో తైలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ పొలాల అమావాస్య రోజు శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తే దారిద్రాలు తొలగి సుఖసంతోషాలతో ఉంటారని నమ్మకంతో అభిషేకిస్తారని వెల్లడించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచర ణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు..ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మహిపాల్ రెడ్డి ,ఎంపీపీ దర్బాని వెంకట్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్ గుప్త,, నర్సింలు ,ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు.