శిక్షణ కేంద్రాల్లో నిరసనలు:యూటీఎఫ్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7న శిక్షణ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి టి.లక్ష్మారెడ్డి, జిల్లా అధ్మక్షుడు జి.సాయిలు తెలిపారు.  ఖాళీగా ఉన్న ఉప విద్యాధికారి. ఎంఈవోల పోస్టులను త్వరాగా భర్తీ చేయాలని తెలియజేశారు.రెండు సంవత్సరాలుగా నలుగుతున్న గ్రేడ్‌-2 పండిత్‌,పీఈటీ పోస్టులను అవ్‌గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. నిరసనలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని తెలిపారు.