శివకుమార్‌ మృతిచెందలేదు : అకున్‌ సబర్వాల్‌

హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీ విద్యార్థిని అరుణ హత్య కేసులో నిందితుడు శివకుమార్‌ మృతిచెందాడని వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. శివకుమార్‌ మృతిచెందలేదని డీసీపీ అకున్‌సబర్వాల్‌ తెలిపారు. అతన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడని డీసీపీ చెప్పారు. పుణె ససూన్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోత్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.