శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి)  :
రాష్ట్రంలో శివాలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజామునుంచే పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి పిల్లాపాపలతో సహా తరలివస్తున్నారు. దీంతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి సందర్భంగా హన్మకొండలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి ఆలయం, మెట్టుగుట్టపై కొలువైన రామలింగేశ్వరస్వామి ఆలయాలతోపాటు కరీంనగర్‌ జిల్లా వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3గంటల నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూకట్టారు. శివనామస్మరణలో మునిగితేలుతున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు, రుద్రాభిషేకాలు చేయించుకుని స్వామి వారి ఆశీస్సులు అందుకుంటున్నారు.