శీతాకాల సమావేశాల్లోగా స్థాయి సంఘాలు: సభాపతి

హైదరాబాద్‌: శీతాకాల సమావేశాల్లోగా స్థాయి సంఘాలు ఏర్పాటు చేస్తామని శాసన సభాపతి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. స్థాయిసంఘాలకు ఆమోదం తెలపడం సభ చరిత్రలో ఓ మైలురాయన్న ఆయన పార్టీలన్నింటితో పాటు ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పారు. స్థాయి సంఘాల ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని స్పీకర్‌ అభిప్రాయపడ్డారు. మరింత లోతుగా అద్యయనం చేసి విధి విధానాలను రూపొందిస్తామని అవసరమైతే అమల్లో ఉన్న ఓ రాష్ట్రంలో పర్యటిస్తామని ఆయన తెలిపారు. కమిటీల ఏర్పాటు కారణంగా సభాగౌెరవానికి ఎలాంటి ఆటంకం ఉండదని పూర్తిగా పార్లమెంటు తరహాలోనే కమిటీలు ఉంటాయని ఇతర రాష్ట్రాల కమిటీలతో సంబందం ఉండదని స్పీకర్‌ స్పష్టం చేశారు.