శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్శు
భాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 22 :-. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సతీష్ శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శుభకృత నామ సంవత్సరం అంతా జవహర్ నగర్ ప్రజలు నాయకులు అధికారులు తన శ్రేయోభిలాషులు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు ఈ సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు శ్రేయోభిలాషులందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు