శృతిమించిన సంబరాలు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో వైకాపా సంబరాలు శృతిమించాయి.ఉప ఎన్నికల్లో వూహించిన ఫలితాలు సాధించడంతో వైకాపా శ్రేణులు పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. అయితే ఆ పార్టీ నేత రెహ్మాన్‌ఖాన్‌ ఉత్సాహంతో ఉత్సాహంతో రెచ్చిపోయి కార్యకర్తలతో కలిసి తన వద్ద ఉన్న  తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు  జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలిసులు అయన్ని అదుపులోకి తీసుకున్నారు.