శ్రీశైలంలో పెరిగిన భక్తులు
హైదరాబాద్,,ఫిబ్రవరి14(జనంసాక్షి): : శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. మల్లన్న సర్వదర్శనానికి 5గంటలు, ప్రత్యేక దర్శనానికి 2గంటలు, శివదీక్ష స్వాములకు 3గంటల సమయం పడుతోంది. ఈ నెల 17న మహాశివరాత్రి శివరాత్రి సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ, ఏపీ రాష్టాల్ర అధికారులు తెలిపారు. ఇరు రాష్టాల్ర నుంచి శ్రీశైలానికి 1400 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. బస్సులు శ్రీశైలం యజ్ఞవాటిక వరకు మాత్రమే నడవనున్నాయి. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.