శ్రీశైలం జలాశయంలోకి భారీగా ఇన్‌ఫ్లో

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 1,26,276 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 843.80 అడుగులకు చేరుకోగా. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది.